తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై హీరో నాని స్పందన!

  • ఓట్లు ఎక్కువ వచ్చినా నూతన్ నాయుడు ఎలిమినేషన్
  • ట్రోల్ చేస్తున్న అభిమానులు
  • కంటెస్టెంట్ లు అందరూ తనకు సమానమే అన్న నాని
చివరి అంకానికి చేరుకున్న రియాల్టీ షో బిగ్ బాస్ పై అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. నూతన్ నాయుడు ఎలిమినేషన్ సరిగ్గా జరగలేదని... గీతామాధురి, తనీష్ లలో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించడానికి... ఎక్కువ ఓట్లు వచ్చినా నూతన్ నాయుడుని బిగ్ బాస్ నిర్వాహకులు, హోస్ట్ నాని కలసి బయటికి పంపించారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్ పై నాని స్పందించాడు.

'మీలో కొంత మంది బాధ పడ్డారు. క్షమించండి. షో గురించి మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. షోలో మీకంటూ ఓ అభిమాన కంటెస్టెంట్ ఉంటారు. వారిని మీరు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. కానీ, ఒక హోస్ట్ గా నేను ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా చూడలేను. అందరినీ సమానంగానే చూడాలి. నాకు ప్రతి ఒక్కరూ సమానమే. ప్రత్యేకంగా ఏ ఒక్కరికో వత్తాసు పలుకుతున్నానని భావించవద్దు. నాపై నమ్మకం ఉంచండి. మీ అందరి మద్దతుతోనే చివరకు ఒకరు విజేతగా నిలుస్తారు. ఎలిమినేషన్స్ అన్నీ మీ ఓట్లతోనే జరుగుతాయి. మీరు నన్ను ఇష్టపపడినా, ఇష్టపడకపోయినా మీరంతా నా ఫ్యామిలీనే. మీ ప్రేమను పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా' అంటూ ట్విట్టర్ వేదికగా నాని ఓ లేఖను పోస్ట్ చేశాడు. 
Go Back to Shorts
nani
bigboss
troll
tollywood

More Telugu News